భోజనం.. ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం అన్న సంగతి తెలిసిందే. భజనం తింటున్నారు సరే.. ఆ తర్వాత ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అన్నది ఎప్పుడైనా ఆలోచించారా. సాధారణంగా.. భోజనం చేసిన వెంటనే కొందరు నిద్రిస్తారు. ఇంకా కొందరు స్నానం చేస్తారు. మరి కొందరైతే స్మోకింగ్ చేస్తారు. ఇలా ఎవరికి నచ్చింది వారు చేస్తుంటారు. కానీ, వాస్తవానికి భోజనం తర్వాత కొన్ని అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. భోజనం చేసిన తర్వాత టీ అసలు తాగకూడదు.
ఎందుకంటే టీ తాగితే ఎక్కువ మోతాదులో ఆసిడ్ విడుదలై.. ఆహారం జీర్ణమవడానికి కష్టమవుతుంది. అలాగే నిద్ర జీవితంతో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అది కూడా తిన్న వెంటనే అసలు నిద్రపోకూడదు.
ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏర్పడుతుంది. ఇక కొందరికో అలవాటు ఉంటుంది. భోజనం పూర్తైన తర్వాత కూడా తిన్న ప్లేటు ముందు నుంచి కదలరు. అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అలానే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందటున్నారు.
ఇక చాలా మంది తిన్న వెంటనే నడుస్తూ ఉంటారు. అలా చేస్తే మంచిది అనుకుంటారు. అది తప్పు. ఆహారానికి ముందు అరగంట తర్వాత నడవాలి అంటున్నారు. ఒకవేళ తిన్న తర్వాత చేయాలనుకుంటే అరగంట తర్వాత నడవడం మంచిది. డిన్నర్ చేసిన వెంటనే దంతాలను తోముకోవడం కూడా చాలా మందికి అలవాటు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే దంతాల మీద ఉన్న ఎనామిల్ పొర తొలగిపోతుంది. అప్పుడు దంతాలు తమ సహజ కాంతిని కోల్పోతాయి. అయితే భోజనం చేసిన అరగంట తర్వాత తోముకోవచ్చు. ఆహారం తీసుకున్న తర్వాత ధూమపానం చేస్తే ఒక సిగరెట్, పది సిగరెట్లతో సమానం. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో.. దీనికి దూరంగా ఉండండి.
0 Comments:
Post a Comment