The Indian Institute of Sciences (IISc) has released a key report in the wake of the latest developments. The report, which looks at how the virus will affect the country by March next year, estimates that by March 2021, India will have a low of 37.4 lakh and a high of 6.18 crore if the virus is severe.
చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. భారతదేశం దీనికి అతీతం కాదు. మన దేశంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. టెస్టులు చేస్తున్న కొద్దీ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున్నే పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మహమ్మారి బారిన పడి 24 వేల మంది చనిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) ఓ కీలక రిపోర్ట్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, 2021 మార్చికి ఇండియాలో తక్కువలో తక్కువగా 37.4 లక్షలు ఉండొచ్చని, వైరస్ ప్రభావం విపరీతంగా ఉంటే ఎక్కువలో ఎక్కువగా 6.18 కోట్ల కేసులు నమోదవ్వొచ్చని తేల్చింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రావొచ్చని ఐఐఎస్‌సీ హెచ్చరించింది.
గత మార్చి 23 నుంచి జూన్ 18 వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల డేటా, ట్రెండ్స్‌ను పరిశీలించి ఐఐఎస్‌సీ రాబోయే కాలం కేసులు అంచనా వేసింది. వైరస్ ప్రభావం విపరీతంగా ఉంటే, 6.18 కోట్లు, తక్కువ ఉంటే 37-38 లక్షలు ఉండవచ్చని తేల్చింది. కాగా, ప్రస్తుత కరోనా విస్తృతి పరిస్థితులను బట్టి చూస్తే ఈ లెక్కలు కాస్త మారొచ్చునని విశ్లేషకులు అంటున్నారు. కాగా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా, కొత్త వైరస్ ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించడానికి వారంలో ఒకటి నుంచి రెండ్రోజులు లాక్‌డౌన్ విధించాలని ఐఐఎస్‌సీ పేర్కొంది. కాగా, కరోనా వైరస్ నుంచి 6 లక్షల మంది వరకు కోలుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా, కరోనా వైరస్‌ను వివారించేందుకు ప్రపంచ దేశాల్లోని ఎంతో మంది శాస్ర్తవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్‌ను కనిపెట్టిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వాక్సిన్ ట్రైల్స్‌కు సంబంధించి శుభవార్త చెప్పనుంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేస్-3 హ్యూమన్ ట్రైల్స్ పూర్తి చేశామని యూనివర్సిటీ స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ ట్రైల్స్‌లో మంచి ఫలితాలు వచ్చయని యూనివర్సిటీ తెలిపింది. వివిధ దేశాలలో వందల మంది కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నా.. వాటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శటీ లైసెన్స్ పొందించిన ప్రముఖ ఇండియన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీంతో తర్వలోనే కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

0 Comments:
Post a Comment