At that time Arunachal Pradesh .. the first Galvan clash .. then Korri on the Sikkim border .. then the new map of Nepal .. now Ayodhya .. is the dragon country China making a series of conspiracies to India? That is what analysts are saying. Diplomatically isolated in the eyes of the international community, the country is poisoning the faith of Indians. China is said to have fueled a conspiracy to hurt the sentiments of Indians, especially in the name of Ayodhya.
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు డ్రాగన్ ఎత్తుగడలు
అప్పట్లో అరుణాచల్‌ప్రదేశ్.. మొన్నటికి మొన్న గల్వాన్ ఘర్షణ.. అనంతరం సిక్కిం సరిహద్దుపై కొర్రీ.. ఆ తర్వాత నేపాల్ కొత్త మ్యాప్.. ఇప్పుడేమో అయోధ్య.. భారతదేశాన్ని ఇరుకున పెట్టేందుకు డ్రాగన్ దేశం చైనా వరుస కుట్రలు చేస్తోందా? అంటే అవునంటున్నారు విశ్లేషకులు. దౌత్యపరంగా అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా మారిన ఆ దేశం భారతీయుల విశ్వాసాలపై విషాన్ని కక్కుతున్నది. ముఖ్యంగా అయోధ్య పేరుతో భారతీయుల మనోభావాలను దెబ్బతీసే కుట్రకు చైనా ఆజ్యం పోసిందని చెప్తున్నారు.
శ్రీరాముడు నేపాలీయేనన్న నేపాల్ ప్రధాని ఓలీ వ్యాఖ్యల వెనుక చైనా చెప్పుడు మాటలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. లిపులేఖ్, కాలాపాని, లింపియాదురా భూభాగాలు తమవి అని చెప్పించిందని, ఆ తర్వాత గల్వాన్‌లో ఘర్షణకు దిగిందని.. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైందని పేర్కొంటున్నారు. కొత్తగా కొందరు బౌద్ధ సన్యాసులు అయోధ్యలో చేపట్టిన ఆందోళన వెనుక ఉన్నది చైనానేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'కొన్ని వందల ఏండ్లుగా నేపాల్ సాంస్కృతిక దాడికి గురవుతున్నది. దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారు. దశరథుడు నేపాల్‌ను పాలించాడు. అంటే.. ఆయన కుమారుడైన శ్రీరాముడు కూడా నేపాలీయే. జనకపురికి వచ్చి సీతాదేవిని రాముడు పెండ్లి చేసుకున్నాడు. నేపాల్‌లోని బీర్‌గంజ్‌కు పశ్చిమాన ఉన్న చిన్నగ్రామమే అయోధ్య' అని ఓలీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ మధ్యే భారత భూభాగాలను కలుపుకొని నేపాల్ కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం, రాముడు తమవాడేనని ఓలీ వ్యాఖ్యానించడం వెనుక చైనా జోక్యం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓలీకి ఒరిగేదేంటి?
ఓలీపై వ్యతిరేకత పెరిగి నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో తలెత్తిన సంక్షోభం సందర్భంగా చైనా రాయబారి హావ్ యాంకీ రంగంలోకి దిగారు. ఆమె నేపాల్‌కు చెందిన ఐదుగురు అగ్రనాయకులతో భేటీ అయ్యారు. కాగా, తనను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించేందుకు భారత్ కుట్ర చేస్తున్నది ఓలీ ఆరోపించారు. తనపై పుష్ప కమల్ దహాల్(ప్రచండ) బహిరంగంగా చేస్తున్న విమర్శల వెనుక భారత్ ఉందని ఓలీ భావిస్తున్నారు. అందుకే, చైనా మద్దతుతో భారత్‌ను రెచ్చగొట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయోధ్యలో బౌద్ధ సన్యాసుల నిరసన
మంగళవారం కొందరు బౌద్ధ సన్యాసులు అయోధ్యలో ఆందోళన చేపట్టారు. రామజన్మభూమిలో యునెస్కో ద్వారా తవ్వకాలు చేపట్టాలని అయోధ్య మెజిస్ట్రేట్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. రామజన్మభూమి స్థలంలో ఇదివరకు నిర్వహించిన తవ్వకాల్లో గౌతమబుద్ధుడు, బౌద్ధానికి సంబంధించిన వస్తువులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

0 comments:
Post a comment