Bubonic plague case in China: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో తాజాగా 'బుబోనిక్ ప్లేగు' కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలైన జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్ గ్రంధుల్లో నొప్పి, శరీరంపై పుండ్లతో బాధపడుతున్న ఓ వ్యక్తిని చైనా ఉత్తర ప్రాంతంలోని బయన్నుర్ నగర వైద్యులు గుర్తించారు. అతడి కుటుంబికులు, సన్నిహితులందరినీ గుర్తించి చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేసేందుకు లెవల్-3 ప్రమాద హెచ్చరికలను జారీచేశారు అధికారులు. చైనాకు ఉత్తర సరిహద్దులో ఉన్న మంగోలియా లోనూ బుబోనిక్ ప్లేగు వేగంగా వ్యాపిస్తోంది.
ప్లేగు మూడు రకాలు. వాటిలో ఒక రకం బుబోనిక్ ప్లేగు. ఈ ఇన్ఫెక్షన్లకు ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణం. ఇది ఎలుకలు, గుమ్మడి పురుగులను వాహకాలుగా వాడుకుంటుంది. అవి మనుషులను కుడితే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌ను కలుగజేస్తుంది.
0 Comments:
Post a Comment