అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పరీక్ష కేంద్రం మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణాల్లో ఉంటూ రాత పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న వారు కరోనా పరిస్థితుల నేపథ్యంలో తమ నివాస ప్రాంతాలకు వెళ్లిపోయారని, వారి నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు రావడంతో ఈ అవకాశం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 19 రకాల పోస్టులకు సంబంధించి మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం 11.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

0 Comments:
Post a Comment