తెలంగాణలోని ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులపై ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. గాంధీ, చెస్ట్ సహా పలు ఆస్పత్రుల్లో రోగులను పట్టించుకోవడం లేదని కొందరు బాధితులు స్వయంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అంతేకాదు మృతదేహాల విషయంలోనూ గందరగోళం నెలకొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు కరోనా బాధితులు భయపడుతున్నారు. డబ్బులు ఖర్చైనా పరవాలేదు.. బతికితే చాలని భావించి.. ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. అందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకలే నిదర్శనం.
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న మొత్తం కరోనా బెడ్స్‌లో 9 శాతం మాత్రమే బాధితులతో నిండి ఉన్నాయి.
91 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయని గురువారం వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్‌లో పేర్కొన్నారు. అదే ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం నూటికి నూరుశాతం పడకలు కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి. అదనపు పడకల కోసం రోగులు పోటీపడుతున్నారు. మరికొందరైతే ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక్క బెడ్ ఇప్పించండంటూ.. మంత్రులు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 17, 081 కరోనా పడకలు ఉన్నాయి. వీటిలో 11, 928 ఐసోలేషన్ బెడ్స్, 3,537 ఆక్సీజన్ బెడ్స్, 1,616 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఐతే ప్రస్తుతం 944 ఐసోలేషన్, 423 ఆక్సీజన్, 185 ఐసీయూ బెడ్స్ మాత్రమే నిండిఉన్నాయి. మిగిలినవన్నీ ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 17,081 కోవిడ్ బెడ్స్‌లో ప్రస్తుతం.. 15,529 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఈనేపథ్యంలో కరోనా రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు రాకపోవడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీన్ని చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతోంది.
కాగా, సికింద్రాబాద్‌లో ఉన్న గాంధీ ఆస్పత్రి.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కోవిడ్ కేర్‌గా ఉంది. ఇక్కడ విషమ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తారు. మిత లక్షణాలతో ఉన్న వారికి కింగ్ కోఠి, చెస్ట్, ఫీవర్ హాస్పిటల్లో చేర్చుకుంటున్నారు. ఇక తక్కువ లక్షణాలు, అసలు లక్షణాలు లేని కరోనా రోగులకు నేచుర్ క్యూర్, ప్రభుత్వ నిజామియా, ప్రభుత్వ ఆయుర్వే, ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రుల్లో క్వారంటైన్ చేస్తున్నారు.

0 comments:
Post a comment