ఇండియాలో గత 24 గంటల్లో మరో 24248 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువై... 697287గా నమోదైంది. తాజాగా 24 గంటల్లో 425 మంది కరోనా వల్ల చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 19693కి చేరింది. రోజూ కొత్త కేసులు, మరణాలూ భారీ సంఖ్యలో నమోదవుతూ భారతీయులకు టెన్షన్ తెప్పిస్తున్నాయి. ఇదే సమయంలో... రికవరీ కేసులు కూడా పెరుగుతూ ఒకింత ఊరట కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో 15350 కేసులు రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 424432కి పెరిగింది. అలాగే... ప్రస్తుతం 253287 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 60.9 శాతంగా ఉండగా... మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. ప్రపంచ మరణాల రేటు 8 శాతంగా ఉంది.
అంటే ప్రపంచ దేశాలతో పోల్చితే... ఇండియాలో కరోనా మరణాలు తక్కువగానే ఉన్నట్లు లెక్క.నిన్న ఒక్క రోజే 180596 టెస్టులు జరపడంతో... మొత్తం టెస్టుల సంఖ్య 9969662కి పెరిగింది. టెస్టుల సంఖ్య పెరుగుతుంటే... పాజిటివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.
ప్రస్తుతం దేశంలో మహారాష్ట్రలో కేసులు 2 లక్షలు దాటి... 206619గా ఉండగా... తమిళనాడులో అవి... 111151గా నమోదయ్యాయి. ఢిల్లీలో 99444, గుజరాత్‌లో 36037, ఉత్తరప్రదేశ్‌లో 27707, తెలంగాణలో 23902, కర్ణాటకలో 23474, బెంగాల్‌లో 22126, రాజస్థాన్‌లో 20164 కేసులు నమోదయ్యాయి. ఈ లిస్టులో... తెలంగాణ ఆరోస్థానంలో ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆందోళన కలిగించే అంశం. ఏపీలో ప్రస్తుతం 18697 పాజిటివ్ కేసులున్నాయి. ఐతే... ఏపీలో యాక్టివ్ కేసులు 10వేలు దాటాయి.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత... రష్యాను నాలుగోస్థానానికి నెట్టి... ఇండియా... మూడోస్థానానికి చేరింది. అసోంలో ఒక్క రోజే 720 పాజిటివ్ కేసులు రావడం ఆందోళన కలిగించే అంశం. ఢిల్లీలో క్రమంగా రికవరీ రేటు పెరుగుతోంది. నిన్న రికవరీలు 3083 ఉండగా... కొత్త కేసులు 2244 ఉన్నాయి. అందువల్ల రికవరీ రేటు 71.7గా ఉంది. ప్రపంచంలో ప్రతి 10లక్షల మందిలో... 1483 మందికి కరోనా సోకుతుండగా... ఇండియాలో... అది 506గా ఉంది.

0 Comments:
Post a Comment