Comets rarely land on Earth. The newly discovered comet 'Neo Wise' is approaching Earth. The comet that crosses the orbit of Mercury Mercury for a week will be visible from Earth until the second week of August. It is about 5 km. NASA sources said that it will be long and visible at night.
భూమివైపు తోకచుక్కలు దూసుకు రావడం అరుదుగా జరుగుతుంటుంది. కొత్తగా కనిపెట్టిన తోకచుక్క 'నియో వైజ్' భూమికి చేరువగా రానుంది. వారం కిత్రం బుధ గ్రహం కక్ష్యను దాటిన ఆ తోక చుక్క ఆగస్టు రెండో వారం వరకు భూమిపై నుంచి కనువిందు చేయనుంది. ఇది దాదాపు 5 కి.మీ. పొడవు ఉండనుందని, రాత్రి వేళల్లో కనిపిస్తుందని నాసా వర్గాలు తెలిపాయి.
ఈ తోకచుక్క ఐదు కిలోమీటర్ల పొడువు ఉండటంతో, మనకళ్ళతో కూడా చూడొచ్చని అంటున్నారు. ఈ తోకచుక్క తన కక్ష్యలో పూర్తిగా ఓ రౌండ్ కొట్టడానికి 6,800 సంవత్సరాలు పడుతుందట. అమెరికాలోని టక్సన్ ప్రాంతంలో సూర్యోదయానికి కొన్ని క్షణాల ముందుగా కనిపించిన ఈ తోకచుక్క ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) షేర్ చేసింది.
మార్చి నెల చివర్లో ఈ తోకచుక్కను గుర్తించినట్లు చెప్పిన నాసా.. టక్సన్‌కు ఈశాన్యంగా ఇది కనిపించిందని తెలిపింది.
ఈ తోకచుక్క ఉత్తర అర్ధగోళంలో ఆగస్టు రెండో వారం వరకు కనిపిస్తుంది. కాలుష్యం లేని చీకటి ఆకాశంలో ఇది మనకళ్ళతో కనిపిస్తున్నప్పటికీ, పొడవైన తోకను చూడటానికి బైనాక్యులర్లు అవసరం.

0 Comments:
Post a Comment