దేశంలో కరోనా కేసులు అంతకంతకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులైతే... రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం 20వేలకు పైగా కేసులు నమోదవ్వగా... శుక్రవారం అత్యధికంగా 22771 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 648315కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే కొత్తగా 442 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 18655కి చేరింది. ఇక నిన్న 14335 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 394226కి చేరింది. ఇక... దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 235433కి చేరాయి. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 60.8గా ఉంది. అలాగే... మరణాల రేటు కాస్త తగ్గి 2.9 శాతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఇండియాలో గత 24 గంటల్లో 242383 కరోనా టెస్టులు చేశారు. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 9540132కి పెరిగింది.
ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా అత్యంత తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో 192990 పాజిటివ్ కేసులు ఉండగా... తమిళనాడులో... 102721 కేసులు నమోదయ్యాయి. ఇక... ఢిల్లీలో... 94695 కేసులు నమోదవ్వగా... గుజరాత్‌లో 34600 కేసులున్నాయి. ఇక ఐదో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 25797 కేసులు నమోదయ్యాయి. ఆరోస్థానంలో ఉన్న బెంగాల్‌లో 20488 కేసులున్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లో కరోనా బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడులో కంట్రోల్ లేకుండా పోతోంది. తమిళనాడులో కేసులు లక్ష దాటాయి. ఐతే... ఢిల్లీలో క్రమంగా రికవరీ రేటు పెరుగుతోంది. ప్రస్తుతం అది 69.3 శాతంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లోనూ కూడా కరోనా పెరుగుతోంది. ఈ లిస్టులోకి తెలుగు రాష్ట్రాలు అప్పుడే చేరే అవకాశం లేకపోయినా... ఏపీ, తెలంగాణలో రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కరమే.

0 Comments:
Post a Comment