సీ ఓయె..! థాయ్‌లాండ్ నరమాంస భక్షకుడు..! చిన్నపిల్లలను చంపి తినే నరరూప రాక్షసుడు..! ఇతడి గురించి థాయ్‌లాండ్ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. సీ ఓయె కథ ఆధారంగా ఎన్నో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి. 60 ఏళ్ల క్రితం థాయ్‌లాండ్ ప్రభుత్వం సీ ఓయెను కాల్చి చంపింది. కానీ అంత్యక్రియలు నిర్వహించలేదు. డెడ్‌బాడీ కుళ్లిపోకుండా రసాయనాలు పూసి మమ్మీగా మార్చారు. ఓ ఆస్పత్రి ముందు గాజు గ్లాసులో ప్రదర్శనకు ఉంచారు. దానిపై నరమాంస భక్షకుడు అని రాసి ఉంటుంది.
అసలు సీ ఓయె ఎవరు? అతడి చరిత్ర ఏంటి? ఇన్నాళ్లు అతడి శవాన్ని గాజు సీసాలో ఎందుకు ప్రదర్శన ఉంచారు? 60 ఏళ్ల తర్వాతే ఎందుకు అంత్యక్రియలు చేశారు?థాయ్ లాండ్ మీడియా కథనం ప్రకారం..
సీ ఓయే స్వస్థలం చైనా. తమ దేశం తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జపాన్ సైన్యం చైనా సైన్యాన్ని చుట్టుముట్టినప్పుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఐతే చుట్టూ ఎక్కడ చూసినా యుద్ధంలో మరణించిన వారి శవాలే ఉన్నాయి. తినడానికి తిండి లేక ఆ శవాలనే పీక్కుతిన్నాడు ఓయె. ఆ తర్వాత కొన్నాళ్లాకు 1946లో థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో తోటమాలిగా పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. ఐతే 1958లో రేయాంగ్ ప్రావిన్స్‌లోని ఓ అటవీ ప్రాంతంలో బాలుడి శవాన్ని తగలబెడుతుండగా స్థానికులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలుడి శరీరంలో కొన్ని అవయవాలు లేకపోవడంతో కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేశారు. విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఏడుగురు పిల్లలను చంపేసి వారి అవయవాలను ఉడికించి తిన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆ తర్వాత సీ గురించి స్థానిక మీడియాలో ఎన్నో కథనాలు ప్రసారమయ్యాయి. నేరం రుజువు కావడంతో 1959 సెప్టెంబరు 16న.. 32 ఏళ్ల వయసులో సీని పోలీసులు కాల్చి చంపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పరిశోధనల కోసం సిరిరాజ్ ఆస్పత్రికి అప్పగించారు. అక్కడ సీ మృతదేహాన్ని మమ్మిఫికేషన్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భద్రపరిచారు. ఓ గాజు గ్లాసులో పెట్టి కానిబెల్ (స్వజాతి మాంసం తినేవాడు)పేరుతో ప్రదర్శనకు ఉంచారు.
వాస్తవానికి పిల్లలను చంపి మాంసం తిన్నాడన్న కేసుల్లో సీని దోషిగా భావించడానికి పూర్తి స్థాయిలో ఆధారాలు లభించలేదు. ఈ క్రమంలో ఫరా చక్రపత్రనన్ అనే వ్యక్తికి సీ ఓయె ఎందుకో అమయాకుడు అనిపించింది. చైనా, థాయ్‌లాండ్ పరస్పరం శత్రు దేశాలయినందున.. ఒకరి సైనికులను మరొకరు హింసించి చంపేవారు. దానికి తోడు చనిపోయిన పిల్లలంతా ఒకే విధంగా చనిపోలేదు. దాంతో సీ ఓయె విషయంలో ఏదో జరిగి ఉంటుందని లోతుగా ఆలోచించాడు ఫరా. ఏదేమైనా సీ ఓయె చనిపోయి దశబ్దాలు గడుస్తోంది. కానీ ఇప్పటికీ ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై ఫరా అభ్యంతరం వ్యక్తం చేశారు.
చనిపోయిన వ్యక్తికి కనీసం శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకోవాలని మావన హక్కుల కమిషన్‌లో 2018లో ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు శారు ఫరా. ఆయనకు మరికొంత మంది సహకరించడంతో సిరిరాజ్ ఆస్పత్రి వెనక్కి తగ్గింది. గతేడాది జూన్‌లో కానిబెల్ ట్యాగ్‌ను తొలగించి.. ఆ తర్వాత సీ మృతదేహాన్ని మ్యూజియం నుంచి మరోచోటుకు తరలించింది.ఇలా ఎన్నో పరిణామాల తర్వాత గురువారం ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం గురువారం సీ ఓయె మమ్మీకి అంత్యక్రియలు చేశారు. తొమ్మిది మంది బౌద్ధ సన్యాసుల సమక్షంలో సీ శవపేటిక ముందు మంత్రాలు పఠిస్తూ, కాగితపు పూలు జల్లి శ్మశానానికి తరలించారు. నాంటబురి ప్రావిన్స్ మువాంగ్ జిల్లా వాట్ బ్యాంక్ ప్రేక్ థాయ్ ప్రాంతంలో మృతదేహాన్ని దహనం చేశారు. ఇన్నేళ్ల తర్వాత అతడి ఆత్మకు శాంతి జరిగిందని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి దరిద్రపు విషయాలు ఇప్పుడు అవసరమా
ReplyDelete