భారతదేశంలో కరోనా జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. నాల్రోజులుగా 50వేల మార్కును చేరుకుంటూ, దరిదాపుల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1336861కి పెరిగింది. అలాగే... గత 24 గంటల్లో 757 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 31358కి పెరిగింది. దేశంలో మరణాల రేటు 2.3 శాతంగా ఉంది. ఇక దేశంలో గత 24 గంటల్లో కరోనా నుంచి 32223 మంది కోలుకున్నారు. అందువల్ల మొత్తం రికవరీల సంఖ్య 849431గా ఉంది. రికవరీ రేటు 63.5 శాతంగా ఉండటం ఒకింత ఉపశమనం కలిగించే విషయం. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 456071గా నమోదయ్యాయి.
దేశంలో రోజురోజుకూ టెస్టుల సంఖ్యను పెంచుతున్నాయి రాష్ట్రాలు.
తాజాగా గత 24 గంటల్లో 420898 మందికి టెస్టులు జరిపాయి. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 15849068కి చేరింది.షాకింగ్ విషయమేంటంటే... దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షల నుంచి 13 లక్షలకు చేరడానికి జస్ట్ రెండ్రోజులే పట్టింది. ఇందుకు ప్రధాన కారణం టెస్టుల సంఖ్య పెంచడమేనని తెలుస్తోంది. 4 లక్షలకు పైగా టెస్టులు ఇప్పటివరకూ ఒక్కరోజులో ఎప్పుడూ చెయ్యలేదు. ముందు రోజు కంటే... 68097 టెస్టులు ఎక్కువగా చేశారు. దేశంలో మరణాల రేటు ఇంతకుముందు 2.38 శాతం ఉండేది... ఇప్పుడు అది కాస్త తగ్గి 2.35 శాతానికి మారింది. అంటే... ఇండియా కరోనా చావులను తగ్గించగలుగుతోందన్నమాట. తాజా లెక్కల ప్రకారం... తమిళనాడులో పాజిటివ్ కేసులు 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. మహారాష్ట్రలో రికవరీలు కూడా 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. ప్రపంచంలో 23 దేశాల్లో లక్షకు పైగా పాజిటివ కేసులు ఉన్నాయి.
అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్‌లో కరోనా అత్యంత తీవ్రంగా ఉంది. మొత్తం కేసుల్లో ఇండియా టాప్ 3లో కొనసాగుతోంది. అలాగే రోజువారీ కేసుల్లో కూడా టాప్ 3లో ఉంది. త్వరలోనే టాప్ 2లోకి వెళ్లేలా కనిపిస్తోంది. మొత్తం మరణాల్లో ఇండియా టాప్ 6లో ఉంది. నాల్రోజుల కిందట స్పెయిన్‌ను దాటిన భారత్... తాజాగా ఫ్రాన్స్‌ని వెనక్కి నెట్టింది. ఓ వారంలో ఇటలీని దాటి టాప్ 5కి వెళ్లేలా కనిపిస్తోంది. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్ 3లో ఉంది.

0 Comments:
Post a Comment