ఇండియాలో కరోనా రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. కొత్త కొత్త కేసులు, మరణాలూ పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల్లో 37148 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 40 వేలకు పైగా కేసులొచ్చాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1155191కి పెరిగింది. ఇక మరణాలూ అంతే. వద్దంటే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 587 మంది చనిపోయారు. ఎంతటి విషాదమిది. మొత్తం మరణాల సంఖ్య 28084కి చేరింది. మన దేశంలోనేనా ఇదంతా అని ఆశ్చర్యం కలిగిస్తున్న లెక్కలివి.
ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 2.4 శాతంగా ఉంది. అంటే ప్రతి 1000 మంది కరోనా సోకిన వారిలో... 24 మంది చనిపోతున్నారు. ఇక... గత 24 గంటల్లో 24491 మంది రికవరీ అయ్యారు.
ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 724577కి చేరింది. అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 402529గా ఉంది. రికవరీ రేటు 62.7 శాతంగా ఉన్నా.... రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటం విచారకరమే.గత 24 గంటల్లో దేశంలో... 333395 శాంపిల్ టెస్టులు చేశారు. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 14381303కి చేరింది. రోజురోజుకూ టెస్టుల సంఖ్య పెరుగుతుంటే... పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
ప్రస్తుతం మొత్తం కేసుల్లో భారత్ టాప్ 3లో ఉండగా... రోజువారీ కేసుల్లో టాప్ 2లో ఉంది. మొత్తం మరణాల్లో ఇండియా టాప్ 8లో ఉండగా... రోజువారీ మరణాల్లో బ్రెజిల్ తర్వాత ఇండియా సెకండ్ ఉంది. ఇదివరకు మొదటిస్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు మూడోస్థానానికి చేరింది. ఐతే... ఇండియాలో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది కాబట్టి... త్వరలోనే బ్రెజిల్‌ని దాటి టాప్‌లో నిలిచే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 2.43 శాతంగా ఉండగా... ప్రపంచంలో మరణాల రేటు 4.13 శాతంగా ఉంది. ఇక ఢిల్లీలో రికవరీ రేటు 84.8 శాతానికి చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. ఇప్పటివరకూ లడక్‌లో అత్యధికంగా 84.3 శాతం రికవరీ ఉంది. ప్రస్తుతం దేశంలోని యాక్టివ్ కేసుల్లో ఢిల్లీ ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీలో 15166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు 50వేలు దాటాయి. రాజస్థాన్‌లో 30వేలు దాటాయి. అసోంలో 25వేలు దాటాయి. మహారాష్ట్రలో రికవరీలు 1.75 లక్షలకు చేరాయి. తమిళనాడులో మొత్తం కేసులు 1.75 లక్షలకు చేరాయి. మహారాష్ట్రలో మొత్తం కేసులు 3.19 లక్షలుగా ఉన్నాయి. స్పెయిన్ దేశంలో మొత్తం కేసుల (3.12 లక్షలు) కంటే... మహారాష్ట్రలో కేసులే ఎక్కువ.

0 Comments:
Post a Comment