బ్రిడ్జి కోర్సులకు అనుమతి - 3విధానాలను సూచించిన పాఠశాల విద్యాశాఖ
విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కానందున ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేయగా... కమిషనరేట్ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సులను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించాలని ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. పైగా పాఠశాలలను పునఃప్రారంభించే వరకు కోర్సుల నిర్వహణకు హైటెక్, లోటెక్, నోటెక్ విధానాన్ని సూచించింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బ్రిడ్జి కోర్సుల అధ్యయనాంశాలను(మెటీరియల్) రూపొందించి, విద్యార్థులకు చేరవేయాలంది. ప్రస్తుతం తొమ్మిదో తరగతిలోకి వచ్చిన వారికి ఎనిమిదో తరగతి పాఠ్యాంశాల నుంచి ప్రాజెక్టు వర్కులు ఇవ్వాలని, కంప్యూటర్, అంతర్జాలం, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వారితో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలని పేర్కొంది. ఎలాంటి డిజిటల్ సదుపాయాలు లేని విద్యార్థుల్లో 10-20 మందిని ప్రతి ఉపాధ్యాయుడు దత్తత తీసుకోవాలని సూచించింది.
బ్రిడ్జి కోర్సుల అమలుకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈనెల 13నుంచి ప్రతి మంగళవారం బడులకు రావాలి. ప్రాథమికోన్నత, ఉన్నత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతి సోమ, గురువారాల్లో బడులకు రావాలి. విద్యార్థుల వివరాల నమోదును ఈనెల 10లోగా పూర్తి చేయాలి.
♦ఆన్‌లైన్ నిలిపేసిన ప్రైవేటు పాఠశాలలు:
ఆన్‌లైన్ తరగతులు నిర్వహించినా, రుసుంలు వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని డీఈవోలు ఆదేశాలివ్వడంతో చాలా పాఠశాలలు సోమవారం నుంచి నిలిపివేశాయి. కొన్ని కార్పొరేట్ బడులు మాత్రం ఆన్‌లైన్ తరగతులు కావాలని కోరుతున్నట్లు తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాయి.

0 Comments:
Post a Comment