ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం లో 33 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడం తో కలకలం రేపుతోంది. దీంతో ఆ కార్యాలయాన్ని మూసివేశారు. గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో ఉన్న మహిళా శిశు సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో ఒకే రోజు 33 మంది ఉద్యోగులకు పాజిటీవ్ వచ్చింది. ముందుగా ఈ కార్యాలయంలో రాష్ట్ర డైరెక్టర్‌కు పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆఫీసులో ఉండే 120 మంది ఉద్యోగులకు పరీక్షలు చేయగా.. వారిలో 33 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. మిగతా వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే ఒకేసారి ఓ శాఖ కార్యాలయంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కరోనా బారిన పడటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో మిగతా శాఖల ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.
0 Comments:
Post a Comment