డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 311 పోస్టుల్ని ప్రకటించింది. మొదట 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA కోసం 18 పోస్టుల్ని కలుపుతున్నట్టు ప్రకటించింది. దీంతో పోస్టుల సంఖ్య 185 కి పెరిగింది. ఇప్పుడు మరిన్ని పోస్టుల్ని ఇదే నోటిఫికేషన్‌లో కలిపింది. 126 కొత్త పోస్టుల్ని ప్రకటించడంతో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్య 311 కు పెరిగింది.మొత్తం 311 ఖాళీలు ఉండగా అందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 81, మెకానికల్ ఇంజనీరింగ్- 82, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12, మెటల్లార్జీ- 10, ఫిజిక్స్- 14, కెమిస్ట్రీ- 7, కెమికల్ ఇంజనీరింగ్- 11, ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 17, సివిల్ ఇంజనీరింగ్- 3, మ్యాథమెటిక్స్- 4, సైకాలజీ- 10 పోస్టులున్నాయి.
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

0 Comments:
Post a Comment