Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 5 July 2020

29 మంది ఎంఈవోలు, 474 మంది హెచ్‌ఎంలకు మెమోలు..

నాడు నేడు.. అదే కథ
29 మంది ఎంఈవోలు, 474 మంది హెచ్‌ఎంలకు తాఖీదులు
28 శాతం లోపు పనులు ఉన్నవారిపై చర్యలు

ఇంజినీరింగ్‌, విద్యాశాఖ మధ్య సమన్వయ లోపం
పాఠశాలల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన నాడు- నేడు పనుల్లో ప్రగతి లోపించింది. ఈ నెలాఖరుకల్లా మొత్తం పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా- వివిధ రకాల సమస్యలు, కారణాలతో ఆశించిన స్థాయిలో అవి ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
తొలుత కరోనా, లాక్‌డౌన్‌తో దుకాణాలు తెరవక ఇసుక, సిమెంట్‌ లభ్యంగాక పనులు మందగించగా, ఆ తర్వాత ఉన్నత స్థాయి అధికారులు దానిపై సమీక్ష జరిపి సానుకూలం చేశారు.
పనులు గాడిన పడ్డాయని అనుకునేలోపే.. ఇంజినీర్లు, హెచ్‌ఎంలు, ఎంఈవోల మధ్య సమన్వయం లోపించింది. చేసిన పనులకు బిల్లులు చేసి అప్‌లోడ్‌ చేసే అంశంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది.
ఇంజినీర్లు సహకరించడం లేదని ఎంఈవోలు, హెచ్‌ఎంలు చెబుతుండగా- నిర్దుష్టంగా చెబితే చర్యలు తీసుకుంటామని ఇంజినీరింగ్‌ అధికారులు అంటున్నారు.
ఈ చిక్కుముడితో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా... పనులు ముందుకు సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 28 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

బాధ్యులకు తాఖీదులు
ఇటీవల జేసీ చేతన్‌ నాడు-నేడు పనులపై సమీక్ష జరిపారు. జిల్లాలో సగటున 28 శాతం కన్నా తక్కువ పనులు జరిగిన 474 పాఠశాలల హెచ్‌ఎంలకు, వాటిని పర్యవేక్షించే 29 మంది మండల విద్యాశాఖ అధికారులకు, నియోజకవర్గ పరిశీలకులుగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్షా అభియాన్‌ సెక్టోరల్‌ అధికారులకు మెమోలు జారీ చేశారు.
పనుల్లో ప్రగతి ఎందుకు లేదో సమాధానం చెప్పాలని కోరారు. మెమోల జారీ విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.

నిధులు పుష్కలం
నాడు- నేడు పనులకు నిధుల సమస్య లేదు. మెటీరియల్‌ అందుబాటులోకి వచ్చింది. చేసిన పనులకు బిల్లులు చేసి నిధులు ఖర్చుచేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలోనే సమస్య. ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. ఫలితంగా పనుల్లో ప్రగతి కనిపించడం లేదు.
జిల్లాలో మూడు, నాలుగు పాఠశాలల్లో మినహా.. అంతటా పనుల ప్రారంభమయ్యాయి. నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలి. పనులకు బాధ్యత వహించే వారంతా సమన్వయంతో చేస్తే ఫలితాలు వస్తాయి.
వీఎస్‌ సుబ్బారావు, డీఈవో

ఇంజినీర్లతోనే సమస్య
నాడు- నేడు పనుల కోసం హెచ్‌ఎంలు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. చెక్‌ పవర్‌ ఎంఈవోలకు లేదు. ఇంజినీర్లకు అప్పగించారు. కొందరు ఇంజినీర్లు బిల్లులపై సంతకం పెట్టకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. తాము సూచించిన వ్యాపారి వద్దనే మెటీరియల్‌ కొనుగోలు చేయాలని షరతు పెడుతున్నారు.

హెచ్‌ఎంలకు ఇచ్చిన మెమోలు రద్దు చేయాలి
డీఈవోకు వినతిపత్రం అందజేసిన ఫ్యాప్టో ప్రతినిధులు
 నాడు- నేడు పనుల్లో ప్రగతి లేదంటూ.. అందుకు హెచ్‌ఎంలను బాధ్యులను చేస్తూ డీఈవో మెమోలు జారీ చేయడాన్ని ఫ్యాప్టో ప్రతినిధులు ఖండించారు. ఆ మేరకు సంఘం జిల్లా ఛైర్మన్‌ రఘుబాబు, కేవీజీ కీర్తి శనివారం డీఈవో వీఎస్‌ సుబ్బారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇతర సమస్యలపైనా మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని కోరారు. లోప రహిత సీనియారిటీ జాబితాలు తయారు చేసి ఉద్యోగోన్నతులు ఇవ్వాలని, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 30 రోజుల వేతనం, డీఏలు, పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు తదితరాలపై నిర్ణయాలు తీసుకోకుండా ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులు అప్పగించి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. డీఈవోను కలిసిన వారిలో చల్లా శ్రీనివాసులు, రవి, వై.వెంకట్రావు, చెన్నుపాటి మంజుల, అమ్మయ్య తదితరులు ఉన్నారు.

1 comment:

  1. 👉Spsr Nellore జిల్లాలో 2018 DSC స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో నష్టపోయిన BC.E (2007వరకుOC) అభ్యర్థుల మనోవేదన.
    07/07/2007 నాడు ముస్లిం ల కోసం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డా" y.s. రాజశేఖర రెడ్డి గారు G.O.ms.no.23 bc welfare c2 ని విడుదల చేశారు.దాని ప్రకారం అప్పటిదాకా OC కేటగిరిలో ఉన్న ముస్లిం లకు EXCEPT( Pathan, Mogal,Sayyid,Arab,Irani, Mushaik, Bohra,Jamayat,Navayat)
    4% రిజర్వేషన్ లభించినది. అప్పటి నుంచి వాళ్ళు bc.e .... ఈ G.O ప్రకారం అప్పటికే BC.B కేటగిరిలో ఉన్న ముస్లింలు ( Dudekula,Laddaf,Pinjari, Noorbasha) లకు BC.E వర్తించదు అని స్పష్టంగా ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ.........
    👉...SPSR నెల్లూరు జిల్లా 2018 DSC .... school assistant social studies లో షేక్. సుభాన్ బాషా , షేక్. బాజీ అను ఇద్దరు అభ్యర్థులు BC.E category నందు దరఖాస్తు చేసి సెలెక్ట్ అయ్యారు సదరు అభ్యర్థులు గత 35 సం" లు గా BC.B దూదేకుల కేటగిరీలో చదువుకొని, 2008 లో BC.B permanant cast certificate (MRO office నుండి) 2015 BC.B cast certificate మీ సేవ ద్వారా పొంది , BC.B కేటగిరిలో ఉపకార వేతనాలు పొంది, 2008 DSC,2012 DSC, 2014DSC ఇవే కాకుండా2017 వరకు జరిగిన కానిస్టేబుల్,గ్రూప్స్ లాంటి ప్రభుత్వ పరీక్షలన్నీ BC.B రిజర్వేషన్ లోనే వ్రాస్తూ BC.B లో కాంపిటీషన్ ఎక్కువగా ఉందని అలాగే BC.E రిజర్వేషన్ లో తక్కువ కాంపిటీషన్ ఇంకా 2018 DSC లో BC.E రిజర్వేషన్ లో 4 పోస్ట్లు (NOTE... 2012DSC,2014DSC లలో BC.E కేటగిరిలో ఒక్క పోస్టు మాత్రమే) రావడంతో BC.E లో దరఖాస్తు చేసుకుని సెలెక్ట్ అయ్యారు.అలాగే ఇంటిపేరు SHAIK చూపించి రెవెన్యూ శాఖను తప్పుద్రోవ పట్టించి 2018 వరకు BC.B కేటగిరిలో ఉన్న ఇద్దరు 2019 లో BC.E caste certificate పొందడం వలన ఒరిజినల్ BC.E అభ్యర్థులకు అనగా(2007 వరకు OC) గా ఉన్న అభ్యర్థులకు నష్టం జరిగింది. నెల్లూరు జిల్లాలో దూదేకుల వారి ఇంటి పేర్లు shaik లో ఉండటం వలన సదరు అభ్యర్థులు ఈ మోసానికి పాల్పడినారు.
    👉అందులో ఒక అభ్యర్థి షేక్.బాజీ అన్న షమీం అనే అతను నాయుడుపేట లోని ప్రాథమిక పాఠశాల నందు SGT ఉపాధ్యాయుడిిగా BC.B కేటగిరిలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే ఇంట్లో అన్నదమ్ములకు వేరు వేరు రిజర్వేషన్ BC.B, BC.E కేటగిరీలలో ఉద్యోగాలు ఎలా ఇస్తారు.చదువులు, ఉపకార వేతనాలు అన్ని BC.B రిజర్వేషన్ లోనే ఉండగా ఉద్యోగ విషయంలో వేరే రిజర్వేషన్ BC.E కి మధ్యలో మారడం ఎంతవరకు న్యాయం.
    👉నష్టపోయిన అభ్యర్థులు జిల్లా విద్యాశాఖాధికారి వారికి,జిల్లా కలెక్టర్ వారికి 26/02/2019 న మొదటి కంప్లైంట్ చేశారు ఆ తర్వాత స్పందన లో అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దృష్టికి సమస్యను తీసుకు వెళ్ళారు. నెల్లూరు జిల్లా కలెక్టరు వారు సమస్య ని పరిష్కరించడానికి గౌరవ జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో DLSC కమిటీ వేసి ఉన్నారు.
    👉నష్టపోయిన నిరుద్యోగులకు కంప్లైంట్ ఉపసంహరించుకోమని ఒత్తిడులు రావడం, ఫోను ద్వారా సంప్రదింపులు వివిధ రకాల ప్రలోభాలకు గురి చేయడం ఇవన్ని రికార్డెడ్ గా ఉన్నాయి. సంప్రదింపులు కుదరకపోవడంతో సదరు అభ్యర్థులు DLSC కి వచ్చే రిపోర్ట్స్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి శతప్రయత్నాలు చేస్తున్నారు.
    👉భావి భారత పౌరులను తయారు చేసే ఒక ఉపాధ్యాయ ఉద్యోగం పొందడానికి ఇలాంటి చర్యలకు పాల్పడి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇటువంటి వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నెల్లూరు జిల్లా గౌరవ జాయింట్ కలెక్టర్ వారు సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించి నష్టపోయిన నిరుద్యోగులకు త్వరితగతిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.
    .............ఇట్లు
    Spsr నెల్లూరు జిల్లా
    BC.E అభ్యర్థులు(2007 వరకు OC).

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top