భారత్‌లో ఒక్కరోజే 25,000 కేసులు!
24గంటల్లో 24,879 కేసులు, 487మంది మృత్యువాత
దేశంలో 21,123 దాటిన కొవిడ్ మరణాలు
దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 24,879పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో తొలిసారిగా ఒక్కరోజే దాదాపు 25వేల మార్కు దగ్గరకు చేరింది. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా వైరస్ బాధితుల్లో నిన్న ఒక్కరోజే 487మంది మృత్యవాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 21,129కి చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 4,76,378 మంది కోలుకోగా మరో 2,69,789ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 62గా ఉంది.
కొనసాగుతున్న ఉద్ధృతి..
మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో 6603 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,23,724గా నమోదైంది. వీరిలో ఇప్పటి వరకు 9448మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తమిళనాడులో నిన్న ఒక్కరోజే 3756 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు చేరింది. వీరిలో 1700మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశ రాజధాని దిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దిల్లీలో కొత్తగా 2033 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 1,04,864కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3213మంది చనిపోయారు. అయితే, దిల్లీలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిసంఖ్య అధికంగా ఉంది. రికవరీ రేటు దాదాపు 70శాతంగా ఉండటం మాత్రమే ఊరట కలిగిస్తోంది.
తమిళనాడు: 14రోజుల్లో 4లక్షల టెస్టులు..
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా నిత్యం భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. గడిచిన 14 రోజుల్లోనే 4లక్షల నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఇక దిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ నిత్యం భారీ స్థాయిలో కరోనా టెస్టులను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 2,67,000 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు భారత్‌లో 1,07,40,832 పరీక్షలు జరిపినట్లు తెలిపింది.

0 Comments:
Post a Comment