దేశంలో కరోనా ఉగ్రరూపం అంతకంతకు ఎక్కువవుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 20 వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 625544కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి 379892కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా చనిపోయిన సంఖ్య 379గా నమోదైంది. దీంతో దేశంలో కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 18213కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 241576 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన కోవిడ్ 19 టెస్టుల సంఖ్య 9297749కు చేరుకుంది. మరోవైపు దేశంలో రికవరీ రేటు 60.7కు చేరింది.
కరోనా కేసుల అప్‌డేట్
మరోవైపు నిన్న కరోనా కేసుల స్థాయిలోనే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఉండటం ఊరట కలిగించే విషయం.
ఇక కరోనా కేసుల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న మహారాష్ట్రలో వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఆ సంఖ్య లక్ష దాటింది.

0 Comments:
Post a Comment