హైదరాబాద్: నోవెల్ కరోనా వైరస్ గాలి ద్వారా సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో తన మార్గదర్శకాలను మార్చుకోవాలని కూడా శాస్త్రవేత్తలు సూచించారు. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఈ అంశంపై ఓ కథనాన్ని రాసింది. 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు.. కరోనా వైరస్ గ్యాలి ద్వారా వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. ఆ శాస్త్రవేత్తలంతా డబ్ల్యూహెచ్‌వోకు తమ ప్రతిపాదన కూడా పంపారు.
కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. దగ్గినా.. తుమ్మినా.. నోటి నుంచి కానీ ముక్కు నుంచి వచ్చే తుంపర్ల వల్ల
కరోనా వైరస్ సోకుతుందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే వైరస్‌పై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు మాత్రం.. గాలి ద్వారా కూడా కరోనా సంక్రమించే అవకాశాలు ఉన్నట్లు తేల్చారు. శాస్త్రవేత్తలు తమ అధ్యయనాన్ని వచ్చే వారం ఓ జర్నల్‌లో ప్రచురించనున్నారు.
డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఇటీవల ఈ అంశంపై మాట్లాడారు. ఎవరైనా సవాల్ చేస్తే మేం సిగ్గుపడేది లేదని ఆమె అన్నారు. వైరస్ విషయం ఎవరు ఛాలెంజ్ విసిరినా అది మంచిదే అన్నారు. శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆధారాలను తమ ఏజెన్సీ సిబ్బంది విశ్లేషిస్తున్నదని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరి ఉద్దేశాలను స్వీకరిస్తామన్నారు. ఇంతకన్నా మెరుగ్గు చేయవచ్చు అని, జర్నలిస్టులైనా, శాస్త్రవేత్తలైనా, ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని మేం సీరియస్‌గా తీసుకుంటామని, మాకు ఇంకా మంచి చేయాలని ఉన్నదని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు.

0 Comments:
Post a Comment