కరోనా కాలంలో ఇతరులను నేరుగా కలవలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు నోట్ల మార్పిడి చేయాలన్నా భయమే..! ఇక బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా కాలంలో ఆర్టీసీ బస్సు టికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసేందుకు కొత్త యాప్ను రూపొందించింది. ప్రథమ్ అనే యాప్ ద్వారా ఇకపై టికెట్లను జారీచేస్తారు. జులై 20 నుంచి ఈ సేవలను ప్రారంభిస్తారు. మొదట ఏపీ వ్యాప్తంగా 19 డిపోల్లో ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో టికెట్లను జారీచేస్తారు.
కరోనా వ్యాపించకుండా ఉండేందుకు కండక్టర్లు, డ్రైవర్లు ప్రత్యేక మొబైల్ సమకూర్చుకోవాలని ఆర్టీసీ అధికారులు సిబ్బందిని ఆదేశించారు.
సంస్థ సూచించిన ప్రమాణాల మేరకు స్మార్ట్ ఫోన్లు సమకూర్చుకోవాలని తెలిపారు. సిబ్బందికి అవసరమైన సాఫ్ట్వేర్ అందిస్తామని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఈడీలు, ఆర్ఎంలకు ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాలు జారీ చేశారు. ప్రథమ్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 5శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుందని వెల్లడించారు.ఈ డిపోల్లోనే ప్రయోగాత్మకంగా ప్రథమ్ యాప్:
విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు-1, రాజమహేంద్రవరం, ఏలూరు, శ్రీకాకుళం-1, అనకాపల్లి, మచిలీపట్నం, గుంటూరు -1,2, అమలాపురం, రావులపాలెం, చిత్తూరు-2, తాడిపత్రి డిపోలు.

0 comments:
Post a comment