ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కెన్యా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించింది. 2021లో మళ్లీ స్కూల్స్ తెరవనున్నట్లు ప్రకటించింది. కెన్యా విద్యా శాఖ కేబినెట్ సెక్రటరీ ప్రొఫెసర్ జార్జ్ మగోహా ఈ మేరకు ప్రకటన చేశారు. కెన్యాలో కరోనా తీవ్రత రానురాను పెరుగుతోందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్కూల్స్ తెరవడం శ్రేయస్కరం కాదని ఆయన ప్రకటించారు.
విద్యా సంవత్సరం వృధా అవుతుందని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదని చెప్పారు. అయితే.. ఈ విద్యా సంవత్సరంలో ఏ క్లాస్ చదువుతున్నారో.. 2021లో మళ్లీ అదే క్లాస్‌లో చదవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కరోనా నేపథ్యంలో కెన్యాలో మార్చి 15 నుంచి స్కూల్స్ మూతపడ్డాయి.

0 Comments:
Post a Comment