ఆ మాస్టార్లకు అవస్థలేనా?
2003 డీఎస్సీ టీచర్లకు పింఛను కష్టాలు
🌻మంగళగిరి టౌన్, న్యూస్‌టుడే
దేవుడు వరమిచిన్చా పూజారి కరుణించని విధంగా డీఎస్సీ- 2003 ఉపాధ్యాయుల పరిస్థితి ఉంది. పాత పింఛను విధానానికి అర్హత ఉండి కూడా నూతన పింఛను విధానంలోకి రాష్ట్రంలో సుమారు 7 వేల మంది ఉపాధ్యాయులు చేరాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నూతన పింఛను విధానం అమలు కావటానికి ముందే అన్ని రకాలుగా అర్హతలు సాధించి ప్రభుత్వ పరిస్థితుల కారణంగా ఆలస్యంగా విధుల్లో చేరిన వీరికి పాత పింఛను విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరంతా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తోపాటు ఇతర మంత్రులను కలిసి తమ పరిస్థితిని వివరించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి పాత పింఛను అమలుకు తగు వివరాలు అందజేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనరును ఆదేశిస్తూ ఈ ఏడాది మార్చి 15న ఉత్తర్వులు జారీ చేసింది.
బీ రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమలుకాక ముందు డీఎస్సీ-2003లో 16,449 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2004 ఏప్రిల్‌లో రాతపరీక్ష నిర్వహించారు. కానీ నియామక ప్రక్రియ వివిధ కారణాలతో ఆలస్యమైంది. జిల్లాలో నవంబరు 2005లో కొందరిని 2006 మార్చిలో మరికొందరిని నియమించారు. ఈ మధ్యకాలంలో 2004 సెప్టెంబరు 1 నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి రావడంతో వారిని అందులో చేర్చారు. నోటిఫికేషన్లో సీపీఎస్ ప్రస్తావన లేని దృష్ట్యా తమకు పాత పింఛను విధానం వర్తింపజేయాలని అప్పటి నుంచి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
♦️వివరాలు పంపడంలో తాత్సారం
కేంద్ర ప్రభుత్వ పింఛన్లు, పింఛనుదార్లు సంక్షేమవిభాగం జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరగా డీఎస్సీ 2003లో జిల్లాల వారీగా నోటిఫై చేసిన పోస్టుల వివరాలు, ఎంపికైనవారు, చేరినవారు, ఇతర పోస్టులకు వెళ్లినవారు ప్రస్తుతం ఎంతమంది పని చేస్తున్నారు.. అనే విషయంలో స్పష్టత కోరుతూ గత మే 17న విద్యాశాఖ అన్ని జిల్లాల డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేసింది. డీఈఓలు స్పందించకపోతే తక్షణమే ఆయా వివరాలు పంపాలని కోరుతూ జూన్ 9న మళ్లీ రిమైండర్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల నుంచి నోటిఫికేషన్లో ఎంపికైన వారికి ప్రస్తుతం పనిచేస్తున్న వారికి లెక్కలు తేలడం లేదని సిబ్బంది రకరకాల కొర్రీలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే రెండు సార్లు సమాచారం కోరిన దృష్ట్యా పత్రిక ప్రకటన జారీ చేసి గడువు తేదీ నిర్దేశించి వెంటనే సంబంధిత వివరాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు కోరుతున్నారు.

0 Comments:
Post a Comment