ఇప్పటికే దేశంలో 18 కోట్ల మందిలో యాంటీబాడీలు!
* ‘థైరోకేర్’ సంస్థ అంచనా
దిల్లీ : భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 35 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో లక్ష కేసులు నమోదవడానికి కేవలం మూడ్రోజులే పడుతోంది. అయితే కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ధ్రువీకరించిన టెస్టింగ్ సంస్థల్లో ఒకటైన థైరోకేర్.. యాంటీబాడీలపై ఓ నివేదికను వెల్లడించింది. దేశంలో దాదాపు 18 కోట్ల మందిలో ఇప్పటికే కరోనావైరస్‌కు వ్యతిరేంగా ప్రతినిరోధకాలు(యాంటీబాడీలు) అభివృద్ధి అయినట్లు ఆ సంస్థ పేర్కొంది.
దేశంలోని 600 పిన్‌కోడ్ ప్రాంతాల నుంచి 60 వేల యాంటీబాడీల టెస్టుల డేటాను పరిశీలించినట్లు థైరోకేర్ పేర్కొంది. దీని ద్వారా దేశంలో దాదాపు 15 శాతం ప్రజల్లో ఇప్పటికే ప్రతినిరోధకాలు అభివృద్ధి అయినట్లు తెలుస్తోందని తెలిపింది. థైరోకేర్ సెంటర్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. వెలుమణి ఈ సమాచారాన్ని తన ట్విటర్‌లో పొందుపరిచారు. తమ అంచనాల్లో 3 శాతం అటుఇటుగా ఉండొచ్చని చెప్పారు. అయితే ఇది థైరోకేర్ డేటా మాత్రమే. అధ్యయనం కాదు.
మంగళవారం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,55,191కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 28,084 మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.5శాతంగా ఉంది.

0 Comments:
Post a Comment