లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నకిలీ డిగ్రీల సహాయంతో ఉపాధ్యాయులుగా మారిన 1427 మందిని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. వీరిలో 930 మందిని ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించారు. అయితే ఇప్పటివరకు వీరిలో కేవలం నలుగురి నుంచి మాత్రమే వేతన రికవరీకి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక అంచనా ప్రకారం ఒక ఉపాధ్యాయుడి సగటు ఉద్యోగం 7 నుంచి 8 సంవత్సరాలుగా పరిగణిస్తే, వారందరి నుంచి సుమారు రూ. 900 కోట్లు రికవరీ చేయాల్సివుంటుంది. కాగా ఈ నకిలీ ఉపాధ్యాయులకు సంబంధించిన సమాచారం ఇప్పటివరకూ డైరెక్టరేట్‌కు చేరలేదు.ఈ విషయంలో ఫైనాన్స్, అకౌంట్స్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలగించిన ఉపాధ్యాయుల నుంచి రికవరీ చేయాల్సిన మొత్తాన్ని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అధికారి అంచనా వేయాల్సివుంటుంది.
ప్రాథమిక విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రేణుక కుమార్ ఈ అంశాలను సమీక్షిస్తున్నారు.
0 Comments:
Post a Comment