ఇండియాలో కరోనా రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. కొత్తగా 40425 పాజిటివ్ కేసులొచ్చాయి. ఇప్పటివరకూ ఇంత భారీగా కేసులు ఏ రోజూ రాలేదు. ఇలా రోజురోజుకూ కేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1118043కి చేరింది. అలాగే... నిన్న ఒక్కరోజే 681 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 27497కి పెరిగింది. ఒకే రోజు ఇంత మంది చనిపోవడం కూడా ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. గత 10 రోజులుగా ఇండియాలో రోజూ 500కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి.
ప్రస్తుతం గత 24 గంటల్లో దేశంలో 22664 మంది రికవరీ కావడంతో... మొత్తం రికవరీల సంఖ్య 7 లక్షలు దాటి... 700086కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 62.6 శాతంగా ఉంది. ఇదొక్కటే మన దేశంలో కాస్త ఉపశమనం కలిగించే అంశం.
ప్రస్తుతం దేశంలో 390459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే... మరణాల రేటు దేశంలో 2.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలో మరణాల రేటు తక్కువగానే ఉన్నా... క్రమంగా రోజువారీ మరణాలు పెరుగుతున్నాయి.దేశంలో నిన్న 256039 టెస్టులు జరపడంతో... మొత్తం టెస్టుల సంఖ్య 14047908కి పెరిగింది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది.
ప్రస్తుతం దేశంలో ప్రతి పది లక్షల మందిలో 20 మంది కరోనాతో చనిపోతున్నారు. ప్రపంచంలో ఈ సంఖ్య 78గా ఉంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చితే... కరోనా మరణాల్లో ఇండియా కాస్త మెరుగ్గానే ఉందని అనుకోవాలి. ఇండియాలో... జీరో నుంచి 40వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవ్వడానికి 94 రోజులు పట్టింది. ప్రస్తుతం ఆసియాలోని మొత్తం కరోనా కేసుల్లో ఇండియా 33 శాతం కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో ఇండియా మూడోస్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో అమెరికా తర్వాత రెండోస్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో ఇండియా 8వ స్థానంలో ఉండగా... రోజువారీ మరణాల్లో భారత్ సెకండ్ పొజిషన్‌కి చేరినట్లు వరల్డ్ మీటర్స్ చెబుతోంది.

0 Comments:
Post a Comment