The number of corona positive cases in India has crossed the 10 lakh mark. New cases were reported at record levels. The Central Department of Health and Family Welfare said 34,956 new cases were reported in the past 24 hours. Another 687 died. With the latest cases, the total number of corona positive cases registered in the country has reached 10,03,832. Of these, 6,35,756 conquered the corona and were discharged from hospitals.
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరో 687 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,03,832కి చేరింది. వీరిలో 6,35,756 మంది కరోనాను జయించి.. ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. కరోనాపై పోరాడుతూ 25602 మంది మరణించారు. మనదేశంలో ప్రస్తుతం 3,42,473 యాక్టివ్ కేసులున్నాయి.
గురువారం దేశవ్యాప్తంగా 3,33,228 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇప్పటి వరకు మొత్తం 1,30,72,718 కరోనా టెస్ట్‌లు చేసినట్లు వెల్లడించింది. ఇక మనదేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 63శాతం రికవరీ రేటు ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది

0 Comments:
Post a Comment