ఏపీ స్కూళ్లలో "సెమిస్టర్ విధానం 1నుంచి 6 తరగతులుకు మూడు భాగాలుగా సిలబస్
అమరావతి, జూలై 8 (మనం ప్రత్యేక ప్రతినిధి):
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో భారీ మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా వారిపై చదువుల భారాన్ని తగ్గించేందుకు వీలుగా విద్యాసంవత్సరంతో పాటు సిలబస్ లోనూ భారీ మార్పులు చేయబోతోంది. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీం కోర్టు తీర్పు ఇంకా పెండింగ్ లోనే ఉన్నందున తెలుగు, ఇంగ్లీష్ మీడియంపాఠ్యాంశాలను కలిపి ముద్రిస్తున్నారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ బోధన వరకైనా మార్పులు చేయాల్సిందే అన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. దీంతో విద్యా సంవత్సరానికి మూడు సెమిస్టర్లుగా విద్యా సంవత్సరానికి మార్చుతున్నారు. అందుబాటులో ఉన్న పని దినాల్లో ఈ మేరకు మార్పులు కూడా చేస్తారు. దీని ఆధారంగా సిలబస్ తో పాటు సెలవు దినాలు, ఇతర అంశాలను కూడా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సిలబస్ లో 30 శాతం తగ్గించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఆ మేరకు పాఠ్య పుస్తకాల్లోనూ మార్పులు చేయబోతోంది. కొత్త విధానంలో సబ్జెక్టుకు మూడు టెకస్ట్ బుక్స్, వర్క్ బుక్స్ మాత్రమే ఉంటాయి. మూడు టెస్ట్ బుక్స్ ను మూడు సెమిస్టర్లలో టీచర్ బోధిస్తారు. వీటితో పాటు వర్క్ బుక్స్ కూడా ఇస్తారు. ఇందులో మొదటి సెమిస్టర్ పుస్తకాలు మాత్రమే ప్రస్తుతానికి ముద్రిస్తున్నారు. రెండో సెమిస్టర్ ప్రారంభమయ్యే నాటికి మిగతా బుక్స్ కూడా విద్యార్థులకు చేరవేస్తారు.ఒక్కో టెట్స్ బుక్ లో పాఠ్యాంశాలు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాష పుస్తకాలు మాత్రం ఆయా భాషల్లో ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై సర్కార్ నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.పాఠ్య పుస్తకాలు ఇంగ్లీష్, తెలుగులో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం తెలుగులో బోధన కొనసాగుతుంది. అదే సమయంలో విద్యార్థులు కూడా ఈ పుస్తకాల్లో ఇంగ్లీష్ పాఠాలు కూడా కొంత మేర అవగాహన తెచ్చుకునే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

0 Comments:
Post a Comment