ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అన్‌లాక్ 2కు సంబంధించి ఇప్పటికే కేంద్రహోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. జూలై 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, థియేటర్లు మూతపడి ఉంటాయని.. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి జాతినుద్దేశించి ప్రసగించనున్నారు ప్రధాని మోదీ. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తిపైనే మాట్లాడే అవకాశముంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మరోసారి కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.
ఇటీవల ఆత్మనిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ..
కరోనా వాక్సిన్ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోదీ మళ్లీ ఏం మాట్లాడబోతున్నారు? ప్రజలకు ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
0 comments:
Post a comment