Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 19 June 2020

TS -జీతాల కోత ఆర్డినెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Telangana government's salary and pensions cut by the public sector salary of the government employees is getting worse. Many trade unions are blaming the government. The petition was filed in the DFO Raman Goud High Court. He argued that the government's ordinance was unconstitutional. The court heard the petitioner's arguments and issued a notice to the Telangana government to explain the ordinance within 3 weeks.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వ తీసుకొచ్చిన జీవోపై దుమారం రేపుతోంది. ప్రభుత్వ తీరుపై పలు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై డీఎఫ్‌వో రామన్‌గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన వాదించారు. పిటిషనర్‌ వాదనలు విన్న న్యాయస్థానం.. ఆర్డినెన్స్‌పై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల విచారించిన న్యాయ స్థానం.. వారికి ఏ చట్ట ప్రకారం కోత విధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నించిన కొన్ని రోజుల్లోనే విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేలా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.
మార్చి 24 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్‌ ఆమోదించడంతో ఆర్డినెన్స్‌కు సంబందించి గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో గరిష్ఠంగా 50శాతం కోత విధిస్తారు. కోత విధించిన మొత్తాన్ని 6 నెలల్లో తిరిగి వారికి చెల్లిస్తారు. కాగా, కరోనా లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయ పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం,ప్రజా ప్రతినిధుల జీతాల్లో 70 శాతం కోత విధిస్తున్నారు. పోలీసులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులకు మాత్రమే పూర్తి జీతాలను చెల్లిస్తున్నారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top