🔳కొత్త విధానంలోనూ కన్వేయన్స్ అలవెన్స్‌కు ఐటీ మినహాయింపు
న్యూఢిల్లీ: కన్వేయన్స్ అలవెన్సు పొందే ఉద్యోగులకు ప్రభుత్వం చల్లటి వార్త చెప్పింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని ఎంచుకున్నా, కన్వేయన్స్ అలవెన్స్‌కు పన్ను మినహాయింపు ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఆఫీసు పని మీద ప్రయాణాలు, పర్యటనలు చేసే ఉద్యోగులు లేదా బదిలీ అయ్యే ఉద్యోగులకు కంపెనీలు ఈ అలవెన్సు ఇస్తుంటాయి. కొన్ని పరిమితులకు లోబడి ఈ అలవెన్స్‌కు ఐటీ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారుల కోసం పాత పన్ను చెల్లింపు విధానానికి తోడుగా మరో కొత్త పన్ను విధానం ప్రకటించారు.
0 comments:
Post a comment