ఇండియాని పట్టి పీడిస్తున్న కరోనా... ఐదున్నర లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు...
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 19459 మందికి కరోనా సోకింది. ఈ సంఖ్యను చూసినప్పుడు మనకు పెద్దగా ఆశ్చర్యం కలగట్లేదు. ఎందుకంటే... నెల నుంచి ఇలాంటి భారీ సంఖ్యలు చూసీ చూసీ మనకు అలవాటు అయిపోయింది. కానీ... ఇది చాలా పెద్ద సంఖ్యే. తాజాగా ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 548318కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో ఏకంగా 380 మంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాల కంటే ఈ మరణాలు ఎక్కువైపోతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 16475కి పెరిగింది. గత 24 గంటల్లో ఇండియాలో 12010 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అందువల్ల మొత్తం కోలుకున్న వారి సంఖ్య 321722గా ఉంది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 210120గా నమోదైంది. అందువల్ల ఇండియాలో రికవరీ రేటు 58.7గా ఉంది. ఇది మాత్రమే మనకు కాస్తంత ధైర్యాన్ని ఇస్తోంది.
ఇండియాలో ప్రస్తుతం మరణాల రేటు 3 శాతంగా ఉంది. అంటే కరోనా క్లోజింగ్ కేసుల్లో ప్రతి 100 మందిలో ముగ్గురు చనిపోతున్నారు. ప్రపంచ ప్యాప్తంగా ఈ రేటింగ్ 8 శాతంగా ఉంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. కొత్త కేసుల నమోదులో మూడోస్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో మూడోస్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో 8వ స్థానంలో ఉంది.

0 comments:
Post a comment