తమిళనాడుపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. భారీగా కొత్త కేసులు నమోదవడంతో.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3949 కొత్త కేసులు నమోదవయ్యాయి. మరో 62 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి తమిళనాడులో ఇప్పటి వరకు 86,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 47,749 మంది కోలుకోగా.. 1141 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 37331 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
తమిళనాడులో నమోదైన కేసుల్లో అత్యధికం చెన్నైలోనే ఉన్నాయి. చెన్నైలో ఇవాళ 2167 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు అక్కడ 55,969 కేసులు వచ్చాయి. ఇక టెస్ట్‌ల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 30,039 శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. ఇందులో 3949 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 11,40,441 మందికి కరోనా పరీక్షలు చేశారు.
0 comments:
Post a comment