ఆంధ్రప్రదేశ్ డైరక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 665 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూన్ 19న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 18 చివరి తేదీ. కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ అధికారిక వెబ్సైట్ http://cfw.ap.nic.in/ లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 665
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 19
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 18
విద్యార్హత- ఎంబీబీఎస్. ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
వయస్సు- 2020 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.నోటిఫికేషన్ కోసం http://cfw.ap.nic.in/ వెబ్సైట్ చూడండి.
0 comments:
Post a comment