Amazon Pay has been very popular recently. There are already over 4 million stores across the country scanning the QR code and making payments via 'Amazon Pay'. In addition to that, the company has also made available the latest Mura Innovation facility.
అమెజాన్ పే ఇటీవల బాగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 మిలియన్ లకు పైగా స్టోర్లలో అక్కడ ఉండే క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి 'అమెజాన్ పే' ద్వారా చెల్లింపులు జరిపే అవకాశం లభిస్తోంది. దానికి అదనంగా ఆ సంస్థ తాజాగా ముర వినూత్నమైన సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇకమీదట ఏదైనా కిరాణా స్టోర్, లేదా ఇతర ప్రదేశాల్లో షాపింగ్ చేసే సమయంలో కేవలం పేమెంట్ కోసం అమెజాన్ పే వాడడం మాత్రమే కాదు, ఆ షాపులో ఉండే క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం ద్వారా అక్కడ లభించే అన్ని రకాల వస్తువుల లిస్టింగ్ పొందొచ్చు, వివిధ ఉత్పత్తులకు సంబంధించిన రేటింగ్ కూడా తెలుసుకోవచ్చు. తమకు కావాల్సిన ఉత్పత్తులు కొనుగోలు చేసిన తర్వాత ఎప్పటిలాగే అమెజాన్ పే ఆధారంగా చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ఒకవేళ అప్పటికప్పుడు మీ 'అమెజాన్ పే' అకౌంట్ లో తగిన మొత్తంలో బ్యాలెన్స్ లేకపోతే, Buy now, Pay later అనే సదుపాయం ద్వారా కొంత మొత్తంలో అమెజాన్ సంస్థ మీకు క్రెడిట్ కూడా ఇస్తుంది. చిన్న చిన్న కిరాణా దుకాణాలు, ఇతర షాపులను వెళ్లే ఖాతాదారులను ప్రోత్సహించడం కోసం ఈ కొత్త సదుపాయం తీసుకొచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. ఆన్లైన్లో షాపింగ్ చేసినంత సులభంగా బయట ఎక్కడ ఏ దుకాణానికి వెళ్లినా అదే మాదిరి అనుభూతి కలిగే విధంగా అన్నీ సరళతరం చేయటానికి ఈ కొత్త సదుపాయం తీసుకు వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.
ఇండియాలో Google Pay, PhonePe, Paytm తర్వాత 'అమెజాన్ పే' ని అధిక శాతం మంది వినియోగదారులు వాడుతున్నారు. ఇటీవల కాలంలో యూపీఐ అప్లికేషన్స్ కేవలం చెల్లింపు సదుపాయాలు కల్పించడం మాత్రమే కాకుండా మరిన్ని అదనపు సదుపాయాలను వినియోగదారులకు అందించడం ద్వారా తమ ఫ్లాట్ఫామ్ మరింత విస్తృతం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

0 comments:
Post a comment