న్యూఢిల్లీ: ఆధార్ కార్డును పాన్ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇన్కమ్ టాక్స్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఆధార్ కార్డును పాన్ కార్డుతో కనెక్ట్ చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని గతంలోనే స్పష్టం చేసింది. అంటే పాన్ కార్డు లేనట్లే అవుతుందని గతంలోనే ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఇన్కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా వీలుకాదని హెచ్చరించింది. అంతేకాదు ఆధార్ కార్డును పాన్ కార్డుతో కనెక్ట్ చేయకపోతే ఆర్ధిక లావాదేవీలు జరపలేరని కూడా గతంలోనే వార్నింగ్ ఇచ్చింది.
డాక్యుమెంట్లలో లోపాల వల్లనో లేక మరే ఇతర సాంకేతిక కారణాల వల్లనో చివరి నిమిషంలో అనుసంధానం చేయలేకపోయినవారికి ఆదాయ పన్నుశాఖ మరోసారి అవకాశం ఇచ్చింది. 2021 మార్చి 31వ తేదీలోగా అనుసంధానం పూర్తి చేయాలని అవకాశం ఇచ్చింది. ఆన్లైన్ ద్వారా కూడా ఆధార్ కార్డును పాన్ కార్డుతో కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.
0 comments:
Post a comment