లక్నో: హిందీకి పట్టుగొమ్మగా భావించే ఉత్తప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. శనివారం వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో 7.97 లక్షల మంది విద్యార్ధులు హిందీ పరీక్షల్లో ఫెయిల్ అయినట్టు తేలింది. బోర్డు అధికారులు చెబుతున్నదాని ప్రకారం.. 2.70 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 5.28 లక్షల మంది హైస్కూల్ విద్యార్ధులు తమ మాతృభాష పరీక్షల్లో కనీసం పాస్ మార్కులు కూడా సాధించలేకపోయారు. దాదాపు 2.39 లక్షల మంది హైస్కూల్, ఇంటర్ విద్యార్ధులు అసలు హిందీ పరీక్షకు హాజరు కాలేదు.
జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన ఓ ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ.. ''చాలా మంది విద్యార్ధులకు 'ఆత్మవిశ్వాస్' వంటి సాధారణ పదాలకు కూడా అర్థం తెలియదు.
దీన్నిబట్టి భాష పట్ల వారికున్న అవగాహనా స్థాయి ఏమిటో తెలుసుకోవచ్చు..'' అని పేర్కొన్నారు. హిందీ నేర్చుకోవడం వల్ల భవిషత్తులో అవకాశాలేవీ లేవన్న భావన ఉండడం వల్లే చాలామంది విద్యార్ధులు ఈ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె అన్నారు. కాగా గతేడాది కూడా హిందీ పరీక్షల్లో 10 లక్షల మంది ఫెయిల్ అయ్యారని బోర్డు అధికారులు వెల్లడించారు. ఈసారి యూపీ బోర్డు పరీక్షల్లో దాదాపు 56 లక్షల మంది విద్యార్ధులు పాల్గొన్నారు.

0 comments:
Post a comment