Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 18 June 2020

5G Phones -అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు! స్నాప్‌డ్రాగన్‌ 690 చిప్‌సెట్‌తో సాకారం ఆవిష్కరించిన క్వాల్‌కామ్‌

అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు!
స్నాప్‌డ్రాగన్‌ 690 చిప్‌సెట్‌తో సాకారం
ఆవిష్కరించిన క్వాల్‌కామ్‌
దిల్లీ: అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు ఆవిష్కరించడం సెల్‌ఫోన్‌ కంపెనీలకు సులభం కానుంది. ఇందుకు ఉపకరించేలా, 5జీ టెక్నాలజీకి సహకరించే స్నాప్‌డ్రాగన్‌ 690 చిప్‌సెట్‌ను క్వాల్‌కామ్‌ బుధవారం విడుదల చేసింది. 300-500 డాలర్ల (సుమారు రూ.22,000-38,000) ధరల శ్రేణిలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణకు ఇవి దోహద పడనున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిప్‌సెట్‌తో ఇవి విపణిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, మోటరోలా, షార్ప్‌, టీసీఎల్‌, వింగ్‌టెక్‌ వంటి కంపెనీలు ఈ చిప్‌సెట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయొచ్చు. మన దేశంలో ఇంకా 5జీ సేవలను టెలికాం సంస్థలు ప్రారంభించలేదు.
‘ప్రతి ఒక్కరికీ 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే 60 తయారీ సంస్థలు మా చిప్‌సెట్లతో 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడమో, ప్రకటించడమో చేశాయి. 375 రకాల స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే విడుదల కావడమో, కానుండటమో జరగనుంది. 4జీ కంటే చాలా వేగంగా 5జీ అమలవుతుంది’ అని క్వాల్‌కామ్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ దీపు జాన్‌ తెలిపారు.
* 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఏడాది తరవాత, మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు 4, సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలు 3 మాత్రమే ఆ సాంకేతికను ప్రవేశ పెట్టడంతో పాటు, పరికరాలు విడుదల చేశాయి.
* అదే 5జీ టెక్నాలజీ విషయానికొస్తే, 30కి పైగా దేశాల్లో 60 నెట్‌వర్క్‌ సంస్థలు అమల్లోకి తెచ్చాయి. 40కి పైగా సంస్థలు 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదల చేశాయి.
* ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 17.50-22.50 కోట్ల 5జీ స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయన్నది సంస్థ అంచనా.

ఇప్పటివరకు అధిక ధర ఫోన్లలోనే..
‘ఇప్పటివరకు 5జీ ఫోన్ల ఖరీదు అధికంగా ఉంది. అయితే ఆకర్షణీయమైన గేమింగ్‌, కెమేరా అనుభూతిని వందల కోట్ల మందికి చేరువ చేయాలన్నది మా ప్రయత్నం. అందుకే 300-500 డాలర్ల ఫోన్లలో ఈ చిప్‌సెట్‌ వాడేలా చూడాలనుకుంటున్నాం. అయితే ఫోన్‌ ధర ఎంతో నిర్ణయించాల్సింది తయారీ సంస్థలే. డిస్‌ప్లే, మెమొరీ వంటివి కూడా ఫోన్‌ ధర నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి’ అని జాన్‌ వివరించారు.
* 200 కోట్లు: 5జీ టెక్నాలజీకి దోహదపడే స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌ 6 శ్రేణితో తయారయ్యే వీలున్న స్మార్ట్‌ఫోన్ల సంఖ్య
* 1800 రకాల ఫోన్లు: స్నాప్‌డ్రాగన్‌ 690 చిప్‌సెట్‌తో ఆవిష్కరించనున్న, అభివృద్ధి చేస్తున్న ఫోన్ల రకాలు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top