కరోనా వైరస్ కోసం డ్రగ్ రూపొందించిన హెటిరో రెమిడిసివిర్ ధరను నిర్ణయించింది. ఒక్కో సీసా రూ.5400కు అందజేస్తామని పేర్కొన్నది. ఒక్కో బాటిల్లో 100 మిల్లీగ్రాముల ద్రవణం ఉంటుందని తెలిపింది. దేశంలోని అన్ని ఆస్పత్రులకు త్వరలోనే సరఫరా చేస్తామని వెల్లడించింది. తమ వద్ద 20 వేల మందు సీసాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నది.
కరోనా వైరస్ నివారణ కోసం హెటిరో డ్రగ్ రూపొందించగా
కాంపిటిటర్ సిప్లా కూడా డ్రగ్ తయారీలో నిమగ్నమయ్యాయని తెలిపింది. యాంటీ వైరల్ డ్రగ్ రూ.5 వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది. సిప్లా, హెటిరో రెండు కూడా అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెన్స్ ఐఎన్సీ కంపెనీ నుంచి కరోనా వైరస్ నివారణ మందు తయారీ కోసం పర్మిషన్ తీసుకున్నాయి. భారత్ సహా 127 తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు డ్రగ్ తయారీ కోసం గిలీడ్ అనుమతి ఇచ్చింది.
హెటిరో, సిప్లా రూపొందించే రెమిడిసివిర్ డ్రగ్ తయారీ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదం తెలిపింది. దీంతో హెటిరో డ్రగ్ తయారు చేయగా, సిప్లా డ్రగ్ మరికొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్నది. రెమిడిసివిర్ దక్షిణ కొరియా, అమెరికా రోగులలో తొలిసారి ప్రయోగించారు. కానీ అమెరికాలో డ్రగ్ ధరను ఇంకా నిర్ణయించలేదు. కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. 4 లక్షల 56 వేల 183 పాజిటివ్ కేసులతో. 14 వేల 476 మంది చనిపోయారు.

0 comments:
Post a comment