కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని తమ స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్ నాలుగో దశ త్వరలో ప్రారంభం కానుంది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసిన ప్రభుత్వం... లాక్డౌన్తో చిక్కుకుపోయిన వారిని తమ స్వస్థలాలకు తరలించేందుకు మే 6 న వందే భారత్ మిషన్ను ప్రారంభించింది.
జూన్ 10న ప్రారంభమైన 3వ దశలో వివిధ దేశాలకు 495 ప్రత్యేక విమానాలను నడుపుతోంది ఎయిరిండియా. ఈ మిషన్ వచ్చే నెల 4న ముగియనుంది. ఈ సమయంలో వందే భారత్ మిషన్ నాలుగో దశను జులై-3 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది కేంద్రం. ఇందులో భాగంగా 170 ఎయిరిండియా ప్రత్యేక విమానాలను 17 దేశాలకు(నాలుగో దశ మిషన్లో భాగంగా కెనడా, అమెరికా, బ్రిటన్, కెన్యా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, కిర్గిస్థాన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, థాయ్లాండ్, దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా, మయన్మార్, జపాన్, ఉక్రెయిన్, వియత్నాం) పంపనున్నట్లు ప్రకటించింది.
ఇండో- యూకే మార్గం ద్వారా 38 విమానాలు, ఇండో- యూఎస్ మార్గంలో 32 విమానాలను నడపనున్నారు. సౌదీ అరేబియాకు 26 విమానాలు తమ సేవలను అందించనున్నాయి.
మరోవైపు,షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులపై బ్యాన్ ను జూలై 15 వరకు పొడిగించింది భారత్. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 25 న దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే మే 25 న పరిమిత స్థాయిలో దేశీయ విమాన కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ, అంతర్జాతీయ విమానాలను ఇప్పటికీ అనుమతించలేదు.

0 comments:
Post a comment