ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారతదేశంలో పేమెంట్ సేవల్ని ప్రారంభించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలాఖరులోగా భారతదేశంలో వాట్సప్ పేమెంట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం వాట్సప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి బీటా టెస్టింగ్ ప్రారంభించింది వాట్సప్. ఈ నెలాఖరులో వాట్సప్ పేమెంట్ సేవల్ని ప్రారంభించడానికి ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఏర్పాట్లు చేస్తున్నాయి. మొదటి దశలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమేయం మాత్రం ఉండట్లేదు.
వాట్సప్‌లో అందరు యూజర్లకు పేమెంట్ సేవల్ని అందించేందుకు ప్రభుత్వంతో కలిసి మేం పనిచేస్తున్నాం.
వాట్సప్‌లో పేమెంట్ సేవలు ప్రారంభమైతే భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ పుంజుకుంటాయి. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలోని 40 కోట్ల మంది యూజర్లు సురక్షితంగా లావాదేవీలు జరిపేందుకు ఇది ఉపయోగపడుతుంది.
— మనీకంట్రోల్‌తో వాట్సప్ అధికార ప్రతినిధి ప్రస్తుతం వాట్సప్ పే, ఎస్‌బీఐ కలిసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫేజ్‌పైన పనిచేస్తున్నాయి. కస్టమర్లకు సులభతరంగా సేవలు అందించడంతో పాటు వారి సెక్యూరిటీ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వాట్సప్ చెబుతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాట్సప్ అనుసంధానంలో జాప్యం జరుగుతోంది.
— ఎస్‌బీఐ ప్రతినిధి
భారతదేశంలో గూగుల్ పే సేవల్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు అందిస్తున్నాయి. వాట్సప్ పేమెంట్స్ సేవల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI 2018 ఫిబ్రవరిలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. చట్టపరమైన, నియంత్రణ అడ్డంకుల కారణంగా అనుమతులకు రెండేళ్ల గడువు పట్టింది.
0 Comments:
Post a Comment