స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు గుడ్ న్యూస్. మరోసారి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR తగ్గించింది ఎస్‌బీఐ. అన్ని టెనార్లపై 15 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గింది. ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్‌ను తగ్గించడం వరుసగా ఇది 12వ సారి. కొత్త వడ్డీ రేట్లు 2020 మే 10 నుంచి అమలులోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ తగ్గడంతో హోమ్ లోన్లు తీసుకున్నవారికి వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. దీంతో ఈఎంఐ భారం కాస్త తగ్గనుంది. 30 ఏళ్లకు రూ.25 లక్షల లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ రూ.255 తగ్గుతుందని ఎస్‌బీఐ ప్రకటించింది.
మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా తగ్గించింది ఎస్‌బీఐ.
రీటైల్ టర్మ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్స్ వడ్డీని తగ్గించింది. మూడేళ్ల లోపు టెనార్లపై ఇది వర్తిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు 2020 మే 12 నుంచి అమలులోకి వస్తాయి. రెండు నెలల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఎస్‌బీఐ తగ్గించడం ఇది మూడోసారి. ఇక వృద్ధుల కోసం సరికొత్త డిపాజిట్ స్కీమ్ ప్రకటించింది బ్యాంకు. ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ పేరుతో ఇది అందుబాటులోకి రానుంది. ఈ స్కీమ్‌లో రీటైల్ టర్మ్ డిపాజిట్ల కన్నా సీనియర్ సిటిజన్లకు 30 బేసిస్ పాయింట్స్ అదనంగా వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ టెనార్లకు ఇది వర్తిస్తుంది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
0 Comments:
Post a Comment