దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్‌కు సడలింపులు అమల్లోకి రాగా.. తొలిరోజే కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా పాజిటివ్ కొత్త కేసులు వేగంగా ప్రబలితే మరోసారి లాక్‌డౌన్ తప్పదని స్పష్టం చేసింది. ఒక్కరోజే 2553 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని 72 మంది మరణించారని వెల్లడించింది కేంద్రం. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42వేలు దాటగా, కోవిడ్ రికవరీ రేటు 27 శాతానికి పెరగిందని చెప్పింది.
అయితే గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినట్లు రెడ్‌జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులూ ఉండవని మరోమారు స్పష్టం చేసింది కేంద్రం. రాష్ట్రాల మధ్య రాకపోకలను కూడా అప్పుడే అనుమతించబోమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
రెడ్ జోన్లలో రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీలు నిషేధమని, స్కూళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, సెలూన్లు, స్పాలను అనుమతించమని చెప్పారు. అయితే చిరు వ్యాపారులు.. ఒకరు మాత్రమే నిర్వహించే దుకాణాలను తెరుచుకోవచ్చని అన్నారు.
మరోవైపు వలస కార్మికులను తరలించడానికి రైల్వే ఛార్జీలను 85% ఖర్చును కేంద్రం భరిస్తుందని మిగిలిన 15శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక అన్ని మతాల ప్రార్ధనా స్థలాలను ప్రారంభించరాదని సూచించారు.
0 Comments:
Post a Comment