అల్లం విశిష్టత ఈనాటిది కాదు. పూర్వం నుంచి మన ఆయుర్వేద పండితులు అల్లంలోని ఔషధగుణాలను చెబుతూనే వస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ఉపకరిస్తుంది. 'భోజనాగ్రే సదా పథ్యం లవణార్ద్రక భక్షణం పథ్యం' అంటే సైంధవ లవణం, అల్లం నూరి.. అందులోకి నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంది ఆయుర్వేదం. దీనివల్ల విషదోషాలు తొలగిపోతాయి. అన్నహితవు కలుగుతుంది. అజీర్తి తగ్గుతుంది. ఉసిరికాయ తొక్కుపచ్చడి (నల్లపచ్చడి)లో అల్లం ముద్ద కలిపి కూడా రోజూ తింటే వైరస్‌లను తట్టుకునే శక్తి వస్తుంది. అల్లాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి, వాములను కలిపి టీ కాచుకుని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.
ఇలాచేస్తే పేగులు శుభ్రపడతాయి. ఊపిరితిత్తులు మరింత దృఢమవుతాయి. వైరస్ బారిన పడిన బాధితులు, సాధారణ ఆరోగ్యవంతులు తీసుకోదగిన ఔషధం. వనమూలికలతో కాచే టీలో పంచదార బదులు బెల్లం (సహజమైన రంగులో ఉన్నది) కలుపుకోవాలి.
0 Comments:
Post a Comment