రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసిని మించిన ఔషధ మొక్క మరొకటి లేదు. తులసి ఆకుల రసం, తులసి టీ సర్వరోగ నివారిణిలు. ఏదో ఒక రూపంలో తులసిని తరచూ తీసుకోవాలి. అలా చేస్తే మందులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ గుణాన్ని 'యోగవాహి' అంటుంది ఆయుర్వేదం.
ఏం చేయాలి? : నీడలో ఎండబెట్టిన తులసి ఆకులు, వెన్నులు, రెమ్మలు, శుభ్రం చేసిన వేళ్లతో సహా తులసి పంచాంగాలన్నీ ఒకే గుణం కలిగి ఉంటాయి. ఎండిన తులసిని దంచి, అందులోకి యాలకులపొడి, మిరియాలపొడి, పుదీనా ఆకుల పొడి తగుపాళ్లలో కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని గ్లాసు నీళ్లలోకి వేసి, మరగకాచి, అందులో నిమ్మరసం కలుపుకుని..
రోజుకు మూడు పూటలా టీలాగ సేవించాలి.
విశేషం : కొన్ని రకాల తులసి మొక్కల్లో యూజెనాల్, సిట్రాల్, కర్పూరం, థైమాల్ లాంటి శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి. అందుకే తులసిని సూక్ష్మజీవి నాశకం (యాంటిసెప్టిక్) అంటారు. రేడియేషన్ చికిత్సలో ఆరోగ్యకణాలు దెబ్బతినకుండా తులసి కాపాడుతుంది. లవంగం వేసి వండే వంటకాల్లో తులసి ఆకుల్ని కూడా వేసి వండుకోవచ్చు.
0 Comments:
Post a Comment