The central government has good news for the Employees Provident Fund-EPF account holders. Prime Minister Narendra Modi has announced the 'Atma Nirbhar Bharat Abhiyan' package to tackle the corona virus crisis. Union Finance Minister Nirmala Sitharaman explained the package
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ ప్యాకేజీ ద్వారా అనేక వర్గాలకు వరాలు కురిపించారు. అందులో భాగంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్తలు చెప్పారు నిర్మలా సీతారామన్. 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్నవారికి ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలోనే ప్రకటించింది కేంద్రం.
మార్చి, ఏప్రిల్, మే నెలలకు మాత్రమే ఇది వర్తిస్తుందని గతంలో చెప్పింది. ఇప్పుడు మరో మూడు నెలలు ఈ స్కీమ్ పొడిగిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంటే జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో కూడా ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఇక ఉద్యోగుల వేతనం పెంచేందుకు మరో నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 12 శాతం చొప్పున ఉన్న ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇకపై ఎంప్లాయర్ షేర్ 10 శాతం, ఎంప్లాయీ షేర్ 10 శాతం చెల్లిస్తే చాలు. అంటే ఉద్యోగులకు 4 శాతం వేతనం అదనంగా అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 12 శాతం చొప్పున ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్ చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇక ఇప్పటికే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల వేతనం... వీటిలో ఏది తక్కువ అయితే అది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
0 Comments:
Post a Comment