ఇకపై జిల్లాకు ముగ్గురు జేసీలు
కొత్తగా ఓ కేడర్ పోస్టు సృష్టి
జిల్లాల్లో సంయుక్త కలెక్టర్ పోస్టుల్ని మూడుకి పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో ఇద్దరు జేసీలు ఉండగా, కొత్తగా మరో పోస్టును సృష్టించింది. ప్రస్తుతం సంయుక్త కలెక్టర్లను జేసీ-1, జేసీ-2గా వ్యవహరిస్తుండగా, వారి హోదాల్లో మార్పులతో పాటు స్పష్టమైన పని విభజన చేసింది.
* జేసీ-1 పోస్టుని ఇకపై ‘జాయింట్ కలెక్టర్, రైతు భరోసా, రెవెన్యూ’గా వ్యవహరిస్తారు. ఇది కేడర్ పోస్టు. ఐఏఎస్ అధికారిని నియమిస్తారు.
పర్యవేక్షించే విభాగాలు: వ్యవసాయం, పౌరసరఫరాలు, మార్కెటింగ్, సహకారం, పశుసంవర్ధక, ఉద్యానం, మత్స్య, పట్టు పరిశ్రమలు, రెవెన్యూ, సర్వే, ప్రకృతి విపత్తుల నిర్వహణ, నీటి పారుదల, శాంతి భద్రతలు, ఎక్సైజ్, గనులు, ఇంధనం
* కొత్తగా సృష్టించిన పోస్టుని ‘జాయింట్ కలెక్టర్, గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి’గా పిలుస్తారు. ఇదీ కేడర్ పోస్టే. ఐఏఎస్ అధికారినే నియమిస్తారు.
పర్యవేక్షించే భాగాలు: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, పంచాయతీరాజ్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యలు, పురపాలన, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, మీసేవ, ఆర్టీజీ, ఐటీ. ఇంధనం, నీటిపారుదల మినహా మిగిలిన ఇంజినీరింగ్ విభాగాలు
* ప్రస్తుతం జేసీ-2గా వ్యవహరిస్తున్న పోస్టుని ‘జాయింట్ కలెక్టర్, ఆసరా, అభివృద్ధి’గా పిలుస్తారు. ఇది నాన్ కేడర్ పోస్టు. రాష్ట్ర సివిల్ సర్వీస్(ఎస్‌సీఎస్)కు చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లేదా ఆ హోదా కలిగిన అధికారితో సమాన వేతనం పొందుతున్న నాన్-ఎస్‌సీఎస్ అధికారిని నియమిస్తారు.
పర్యవేక్షించే విభాగాలు: గ్రామీణాభివృద్ధి (డీఆర్‌డీఏ, డ్వామా), మహిళా శిశు సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీల సంక్షేమం, దేవాదాయ, నైపుణ్యాభివృద్ధి విభాగాలు

0 Comments:
Post a Comment