గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లో ఐఎండీ సూచనలు
దిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట పీవోకే ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ చేయనుంది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు నిలిపివేసింది. తాజాగా పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లలో మే 5 తేదీ నుంచి జమ్మూ-కశ్మీర్‌లోని ప్రాంతీయ వాతావరణ విభాగం (ఆర్‌ఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ మార్పులకు సంబంధించి సూచనలు జారీ చేయనున్నట్లు ఆర్‌ఎండీ హెడ్ కుల్‌దీప్ శ్రీవాత్సవ తెలిపారు. ఇదే విషయాన్ని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎమ్.మహపాత్ర స్పష్టం చేస్తూ, ఆ ప్రాంతాలను జమ్మూ-కశ్మీర్ సబ్ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నట్లు తెలిపారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, గిల్గిట్-బాల్టిస్తాన్‌లు తమ దేశంలో భాగమని, వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరుచేయలేరని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఇదే విషయాన్ని పాక్‌కు స్పష్టం చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో కూడా వాతారణ సూచనలు చేయాలని ఐఎండీకి సూచించినట్లు తెలుస్తోంది.

0 Comments:
Post a Comment