చేతులు శుభ్రం.. ప్రయాణం భద్రం
ఆర్టీసీ ప్రయాణికులకు శానిటైజర్ అందించనున్న డ్రైవర్లు
రెండు నెలలు సోడియం హైపో క్లోరైట్‌తో ప్రతి బస్సు శుభ్రం
సిబ్బందికి 1.56 లక్షల మాస్క్‌లు
లాక్‌డౌన్ తర్వాత ఆర్టీసీ బస్ సర్వీసులు మొదలయ్యాక ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం తప్పనిసరి కానుంది. ఇందుకు ఆర్టీసీయే శానిటైజర్ అందజేస్తుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆర్టీసీ పలు ఏర్పాట్లు చేస్తోంది. అవి...
* ప్రతి డ్రైవర్‌కు ఓ సీసాలో శానిటైజర్ అందజేస్తారు. అతడు బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుని చేతిలో శానిటైజర్ వేస్తే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే బస్సు డ్రైవర్లకు ఇటువంటి సీసాలు రెండు ఇస్తారు.
* ప్రతి డిపోలో శానిటైజర్ నింపిన క్యాన్ అందుబాటులో ఉంచుతారు. డ్రైవర్లు డ్యూటీకి వెళ్లే ముందు తమ సీసాలో ఈ శానిటైజర్ నింపుకొని వెళ్లాల్సి ఉంటుంది.
* బస్టాండ్లలో సైతం కాలితో ఒత్తితే చేతిలో శానిటైజర్ పడే యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు తొలుత ఈ యంత్రం వద్ద చేతులు శానిటైజ్ చేసుకొని లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. ప్రతి డిపో వద్ద సిబ్బంది కోసమూ ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తారు.
* రాష్ట్రంలో 427 బస్టాండ్లు, 128 డిపోలు ఉండగా, అన్నిచోట్లా ఈ యంత్రాలు ఏర్పాటు చేసేలా, వీటిని ఆర్టీసీ డిపోల్లోనే తయారు చేయిస్తున్నారు.
* డిపోకు తిరిగి వచ్చిన ప్రతి బస్సును సోడియం హైపో క్లోరైట్ రసాయనంతో శుభ్రం చేయనున్నారు. ఆర్టీసీ పరిధిలో 12 వేల బస్సులు ఉండగా, వీటిని అన్నింటినీ రెండు నెలలపాటు ఇలా నిత్యం శుభ్రం చేసేందుకు అవసరమైన రసాయనాన్ని పెద్దఎత్తున ఇటీవల కొనుగోలు చేసి నిల్వచేశారు.
* ఆర్టీసీ ఉద్యోగులందరికీ మాస్క్‌లు అందజేయనున్నారు. డిపోల్లో బస్సులకు సీట్లు కుట్టే ట్రిమ్మర్లు ఉంటారు. వీరితో మాస్క్‌లు కుట్టిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి మూడు చొప్పున మాస్క్‌లు ఇవ్వనున్నారు. ఆర్టీసీలో 52 వేల మంది ఉద్యోగులు ఉండగా, 1.56 లక్షల మాస్క్‌లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తొలి దఫా కొన్నిచోట్ల మాస్క్‌లు అందజేశారు.

0 Comments:
Post a Comment