రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికి కరోనా పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా రెడ్ జోన్ మండలాల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఈ క్రమంలో శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అక్కడి గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఈ ఫలితాలు రెండు రోజుల్లో రానున్నాయని అధికారులు చెప్పారు. కాగా ఏపీలో ఇప్పటివరకు 1,08,403 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
31 మంది మరణించగా.. 1,051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 441 మందికి కరోనా నెగిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు అధికారులు.
అనంతపురం
జిల్లా సచివాలయం: రెడ్‌జోన్లలో ప్రతి ఒక్కరి నమూనాలు సేకరించి పరీక్షించాలని మంత్రి శంకరనారాయణ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. రెడ్‌జోన్లలో పనిచేసే ఉద్యోగులు అక్కడే ఉండాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో మంచి ఆహారం అందించాలన్నారు. జిల్లాలో అనుమతిచ్చిన పరిశ్రమల్లో సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం పనులు మెరుగు చేయాలన్నారు. జిల్లాలో మరిన్ని ఎక్కువ నమూనాల పరీక్షలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ చంద్రుడు మాట్లాడుతూ, రెడ్‌జోన్లలో 14 రోజులు కొత్త కేసులు నమోదు కాకపోతే ఆరెంజ్, గ్రీన్‌జోన్లుగా మారుస్తామని చెప్పారు.

0 Comments:
Post a Comment