ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసినా... రమేష్ కుమార్‌ను బాధ్యతలు తీసుకోమని ఎక్కడా చెప్పలేదంటూ ఏపీ అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ చెప్పారు. దీనికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం సరికాదన్నారు. కోర్టు తీర్పు, ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ప్రభుత్వం వైఖరి అసమంజసం, అవమానకరంగా ఉందని ఆక్షేపించారు.
'ఏపీ ప్రభుత్వం నన్ను తొలగించలేదు. ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల నా పదవీకాలం ముందే ముగిసింది. ప్రభుత్వం తెచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ (రిటైర్డ్) కనగరాజ్ నియామకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా కోర్టు కొట్టివేసింది. ఎస్ఈసీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ సంస్థ చీఫ్ పదవి ఖాళీగా ఉండకూడదు. అందుకే హైకోర్టు తీర్పు, ఆదేశాల ప్రకారం నేను బాధ్యతలు తీసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి సమాచారం ఇచ్చా. ఆ మేరకు కార్యదర్శి సర్క్యులర్ ఇచ్చారు. నా పదవీకాలం (2021 మార్చి 31) పూర్తయ్యే వరకు నన్నే ఎస్ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలోని 318 పేరాలో స్పష్టంగా చెప్పింది.' అని ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read....
🔍YSR Rythu Bharosa 2020 Payment Status Check
Praja Saadhikara Survay Status
New.....Google Best apps download..

0 comments:
Post a comment